Friday, February 20, 2026

ప్రేమ పేరుతో వంచన.. డిగ్రీ విద్యార్థిని బలి తీసుకున్న బ్లాక్‌మెయిల్ వీడియో!

SHARE

 


గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఒక సీనియర్ విద్యార్థి చేసిన వంచన, ఆపై సాగించిన బ్లాక్‌మెయిల్ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. సమాజంలో నైతిక విలువల పతనాన్ని, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అకృత్యాలను ఈ ఘటన మరోసారి ఎత్తిచూపుతోంది.

పల్నాడు జిల్లాకు చెందిన ఒక మధ్యతరగతి కుటుంబం తమ పిల్లల భవిష్యత్తు కోసం ఊరు వదిలి, తాడేపల్లి సమీపంలోని ఒక గ్రామానికి వలస వచ్చింది. తండ్రి, తల్లి కూలీ పనులు చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. వారి కుమార్తె మంగళగిరిలోని ఒక డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. తన కాళ్ల మీద తాను నిలబడి, తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని కలలు కన్న ఆ విద్యార్థిని జీవితంలోకి 'రహీమ్' అనే యువకుడు ప్రవేశించాడు.

SHARE

Author: verified_user