Thursday, February 26, 2026

ఇజ్రాయెల్ పర్యటన విజయవంతం.. ద్వైపాక్షిక చర్చల్లో కీలక ఒప్పందాలు

SHARE


 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన విజయవంతంగా ముగిసింది. గురువారం జెరూసలేంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ముఖ్యమైన చర్చలు జరిపారు మోదీ. ఈ సమావేశంలో రక్షణ, అంతరిక్ష, సైబర్ భద్రత, జల నిర్వహణ వంటి కీలక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్–ఇజ్రాయెల్ మధ్య పలు ముఖ్య ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. చర్చల అనంతరం రెండు దేశాల ప్రధానులు సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారి సమక్షంలో అనేక కీలక అవగాహన ఒప్పందాలు (MoUs) పరస్పరం మార్పిడి అయ్యాయని తెలిపారు.

కృత్రిమ మేధస్సు, యూపీఐ రంగాల్లో ఒప్పందాలు

మోదీ, నేతన్యాహూ సమక్షంలో భారత్–ఇజ్రాయెల్ మధ్య పలు ముఖ్యమైన అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) రంగంలో పరస్పర సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అలాగే ఆర్థిక అనుసంధానాన్ని బలోపేతం చేసేందుకు యూపీఐ (UPI) సంబంధిత అవగాహన ఒప్పందం కూడా మార్పిడి అయింది. భారత రాయబారి జేపీ సింగ్ ఇజ్రాయెల్ ప్రతినిధులతో కలిసి ఈ ఒప్పందాల పత్రాలను పంచుకున్నారు. ఈ నిర్ణయాలు ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశను చూపనున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

SHARE

Author: verified_user