Thursday, December 4, 2025

ఇక అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు అఫీషియల్ రాజధాని.. చట్ట సవరణకు చకచకా అడుగులు..

SHARE


 విభజన తర్వాత అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించారు. అయితే ఇంతవరకు చట్టబద్ధత రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చొరవతో.. అమరావతికి అధికారిక గుర్తింపు తెచ్చే ప్రక్రియ వేగవంతమైంది. అందుకోసం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాల్సి ఉంది. ఇప్పటికే సవరణ బిల్లుకు కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం కోసం సిద్ధంగా ఉంది. ఆ తర్వాత పార్లమెంటు ఆమోదిస్తే.. అమరావతికి అధికారిక రాజధానిగా చట్టబద్ధత వస్తుంది.



విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాజధాని ఉండాలని అమరావతికి శంఖుస్థాపన చేశారు. ప్రపంచ స్థాయి రాజధానిగా చేయాలని.. అమరావతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ అధికారికంగా ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని అని ఏపీ పునర్వవస్థీకరణ చట్టంలో లేదు. ఈ నేపథ్యంలో అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలో సవరణ చేయడానికి ఇప్పటికే కేంద్రం న్యాయ శాఖ అమోదం తెలిపింది.

SHARE

Author: verified_user